Thursday, September 30, 2010

nivedana

జీవితం విలువ తెలిసేది
కోట్ల సమూహాలకు చేతి కర్రయితేనే

కంటి దివ్వెను వెలిగించినపుడే
జీవన సౌందర్యం గోచరమయ్యేది

జీవన పోరాటం లో సమిధమయినపుడే
మరణం మరీ ప్రియమై శాశ్వత మనుగడ మిగిలేది

Thursday, January 7, 2010

బాంబులు

పేలుతున్నాయి
తెలంగాణ
బతుకులు
బాంబులు

pelutunnayi

shoonyam

దేహం
దాహం
శూన్యం
శృంగారం

Wednesday, December 30, 2009

తరుణం

ఎదిగి ఒదుగుతూ

కరుగుతున్న తరుణం

చిరు జల్లు కోరుకున్నా ..

మంచువాన కురిపిస్తే

తట్టుకోలేక వణుకుతున్నా

వెచ్చని స్పర్శల చినుకు

జీవితాన్ని యిస్తున్దనుకున్న

శీతల శవ స్పర్స

పాల రాతి సమాధి కట్టింది

ఇప్పుడు నేనొక తాజమహల్ని

నా చుట్టూ ప్రేమ సందర్శకులు

ఎడతెగని అన్వేషణ నేను

నీకు అనునిత్య స్వాగత తోరణం