Wednesday, December 30, 2009

తరుణం

ఎదిగి ఒదుగుతూ

కరుగుతున్న తరుణం

చిరు జల్లు కోరుకున్నా ..

మంచువాన కురిపిస్తే

తట్టుకోలేక వణుకుతున్నా

వెచ్చని స్పర్శల చినుకు

జీవితాన్ని యిస్తున్దనుకున్న

శీతల శవ స్పర్స

పాల రాతి సమాధి కట్టింది

ఇప్పుడు నేనొక తాజమహల్ని

నా చుట్టూ ప్రేమ సందర్శకులు

ఎడతెగని అన్వేషణ నేను

నీకు అనునిత్య స్వాగత తోరణం

Tuesday, December 29, 2009

ఆకాశం ఒక అవకాశం

శూన్యాకాశం
అనేకావసరాలు
ఆకాశమంటే
అవకాశమా..?

Wednesday, December 23, 2009

వేటాడే చేపలు

చెరువు
అమ్ముడుపోయింది
చేపలు
వేట వెతనేర్చుకోవాలి

Tuesday, December 22, 2009

కరువు

చెట్టే
పిందేలమ్ముకుంటుంది
పండ్లకు
కరువు

Tuesday, December 8, 2009

శూన్యాకాశం

శూన్యాకాశం


దివ్యత కలిగి దైవం కావచ్చు
విద్య వల్ల పుంభావ సరస్వతి కావచ్చు
స్వరూపం అపర మన్మదునివేమో
ఐశ్వర్యం లో లక్ష్మీ పుత్రునివేమో
మరేమో ఇంకేమో ఏమేమో కవచ్చేమో
అధికారం తో వచ్చిన అహం అగు గాక
పొగడ్తల వల్ల వచ్చిన పొగరు అగు గాక
గెలిచానని మోసగించానని గేలి సేతివేమో
అనుభవించి అనుబంధం తుంచుకున్నందుకు ఆనందమేమో
అభిమానాన్ని గుర్తించ లేని కీటక ధర్మం
నాకు నువ్వు వద్దు వద్దు వద్దు
క్రిములతో క్రీడలు వద్దు
నీ నీడల చాయలు నాకు వద్దు
శూన్యాకాశం నాకు ముద్దు