Tuesday, June 12, 2007

వంధ్యత్వం

సగటుది సామాన్యమయినది నా మనసునా బలం బలహీనత కూడా నా మనసేవర్జీనియాటెక్ అయినా విజయవాడయినాశ్రీలక్ష్మీ, లక్ష్మీసుజాత ఎవరయినాప్రేమ-హింస రూపమెత్తింది అహాలను తృప్తిపరచలేదనేగా!

బిగ్‌బ్రదర్స్ షోలో జాత్యహంకారం ముందువుదారత్వం విశాల పసిఫిక్ మహా సంద్రంలా ప్రదర్శించివైరస్ అవగాహన సదస్సులో ఆ పైత్యమేమిటి?ఆంధ్రాలో సంతోషయినా పరదేశంలో చో అయినా
హంతకులు ఆకాశంలో నుండి ఊడిపడ్డారా?దృతరాష్ట్రునిలా పుట్టుగుడ్డి కాదుగదా మనంగాంధారిలా ఆపాదించుకున్న అంధత్వం మనదిచూపుకే కాదు మనసుకు మనకెందుకులే అని ఉపేక్ష
తిరుపతి ప్రసాదంలా మన ప్రేమలనుఐ లవ్ యురా అంటూ ఎస్.ఎమ్.ఎస్.ల్లోప్రపంచమంతా ఎందరికయినా పంచే స్వేచ్ఛ మనకుంటేమన మనసు అమీబాలా అనుక్షణం మారుతుంటేఆక్టోపస్‌లా అన్నివైపులా వేట మనదేవైరస్‌తోపాటు హింసను పెంచే వటవృక్షాలు మనమే
ముద్దుల శిల్పా రిచర్డ్‌ల ప్రహసనాలకు మీడియా వుత్సాహంవలసజీవుల హత్యలపై వెలుగుచూడని వుదంతాలపైవెలికి తీయడానికి ఎందుకు వంధ్యత్వంనాలుగుగోడల మధ్య తలలెత్తే చిరుమొలకలుసామూహిక హింసారూపం దాల్చేలోపు మనదెంత?
సరసాదేవి గులకరాయినంటూఏ కొండలు పిండి చేయాలనిఆ నైతిక విలువల పతనంలో మనమెంత?
వెలుగుతున్న భారతంలాపావురమై ఎగురుతున్న శాంతిలామనమది పండు ఘనీభవించిచిదిమినా, చెరిపినా ఏమీ పట్టనిస్థితప్రజ్ఞత పొంది మనది కాదులే అనుకొంటే సరిపోయె.

Tuesday, June 5, 2007

అరువుకు కన్నొకటి

మనిషి బుద్ధికి చిలుము పట్టినట్లు
మానవత్వపు మెట్లకు పాకురు పట్టినట్లు
చానాళ్ళ నుండి పేరుకు పోయిన నమ్మకాలు
మసీదుల్లో, మందిరాల్లో అసహాయపు పావురాళ్ళు
శాంతమో, మూఢమో, అసమర్ధమో
ప్రతిసారి ఎక్కడెక్కడో నమ్మకద్రోహంలా
బాంబు పేలుతూనేవుంది
గుక్క పట్టినపిల్లవాడిని ఏమార్చేందుకు
చప్పట్లు కొట్టినట్టు
పట్టించుకోని తల్లి కోసం
కాళ్ళు నేలకు కొట్టినట్టు
మాట వినిపించుకోని భర్తపై కోపం
వంట పాత్రల్లా మోగినట్టు
సీరియల్లో మునిగిన భార్యకై
తలుపు విసిరి కొట్టినట్టు
ప్రజల దృష్టి మరల్చే ప్రభుత్వంలా
మనలను భయపట్టే మతంలా
జనాలకు మత్తు పెట్టే ఛానల్ లా
అప్పుడప్పుడు యింటి దొంగలా
బాంబు పేలుతూనేవుంది
అమాయకులు బలి అవుతున్నారు
బస్సులు కాల్చబడుతున్నాయి
మసీద్ కు దెబ్బ తగలగానే
మందిరం అబ్బా అంటూంది
కోవెల దెబ్బ తింటే
మసీద్ అయ్యో అంటూంది
యిద్దరికి కలిపి శఠగోపం పెడ్తుందెవరు
అల్లా ఆలకించడం లేదా - దైవం తిలకించడం లేదా
పత్రికలు మసిపూస్తున్నాయి - ప్రజలకు బూడిద మిగులుస్తున్నాయి
ఉమ్మడి శత్రువును వెతకడంలో - నేముక్కంటి నౌతా
సోదరా నీ కన్నొకటి అరువిస్తావా?
ఇంద్రునిలా శరీరమంతా కన్నులు నేనౌతా

( మక్కా మసీదులో 18 - 05 - 2007 న జరిగిన బాంబు పేలుడు సంఘటనపై )